MNCL: జన్నారం మండలం డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జన్నారం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న రామ్మోహన్ ఎల్లంపల్లి ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు. అలాగే స్థానిక ఆర్ఐలు గంగా రాజా కాసిపేటకు, భానుచందర్ భీమిని మండలానికి బదిలీ అయ్యారు.