AKP: పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. నాయకులు కోన మోహన్, కే.గౌరీశంకర్, ఓ.లక్ష్మీకుమారి మాట్లాడుతూ.. ధరల పెంపుతో సామాన్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన, ఎరువుల ధరలను నియంత్రించాలన్నారు.