BDK: మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో యూడీసీగా బాధ్యతలు స్వీకరించిన మాధవి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజా సేవే ధ్యేయంగా పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు.