కోనసీమ: అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీలకు తడి-పొడి చెత్త సేకరణ వాహనాలను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గ్రామపంచాయతీ సిబ్బందికి అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… అంబాజీపేట మండలంలోని ప్రతి గ్రామపంచాయతీకి తడి-పొడి చెత్త వాహనాలను అందజేయడం జరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు.