NLG: చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలోని లైటు రాత్రి పగలు తేడా లేకుండా రోజుల తరబడి వెలుగుతోంది. విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాల్సిన అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వార్తా కథనాల ద్వారా ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.