ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పింఛన్లు అందుకుంటున్న వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతాయని పేర్కొన్నారు.