AP: జూన్ నెలకు చరిత్రలోనే ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసింది ఈ నెలలోనే అని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలవద్దని తాను, పవన్ కళ్యాణ్ జట్టు కట్టామని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అందిస్తున్నామని తెలిపారు. గ్యాస్ ధర పెరిగినా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు.