BHPL: జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై వేలాది మంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పథకం కింద ప్రస్తుతం జిల్లాలో 44,348 మంది వృద్ధులు, వితంతువులకు నెలకు రూ. 2,000 చొప్పున, 6,500 మంది దివ్యాంగులకు రూ. 4,000 చొప్పున పింఛన్ అందుతోంది. తాజాగా ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్న విషయం తెలిసిందే.