ATP: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు రైల్వే డివిజన్ సోమవారం నుంచి విశాఖపట్నంలోని సౌత్ కోస్ట్ జోన్ లోకి విలీనమైంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉన్న ఈ డివిజన్ ఇకపై కొత్త జోన్ కిందకు రానుంది. ఐదు దశాబ్దాల క్రితం తమిళనాడు సదరన్ రైల్వేలో ఉన్న ఈ డివిజన్ మార్పు నేపథ్యంలో, అధికారులు బోర్డుల నుంచి పాత పేర్లను తొలగిస్తున్నారు.