SRPT: కోదాడలోని ఈఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి అండర్-19, సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏటుకూరి రామారావు విజేతలకు బహుమతులు అందజేస్తూ, క్రమశిక్షణతో సాధన చేస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించవచ్చని ప్రోత్సహించారు.