TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, ఆసిఫాబాద్లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.