AP: ప్రభుత్వ ఆఫీసులు, స్ట్రీట్ లైట్స్, వాటర్ వర్క్స్ తదితర ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ బిల్లింగ్ విధానం ఇవాళ్టి నుంచి అమలు కానుంది. ఇకపై అధికారులు ఈ-వాలెట్ ద్వారా రీఛార్జ్ చేస్తారు. విద్యుత్ వినియోగం, బిల్లింగ్ విషయంలో పారదర్శకత కోసం స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను అమర్చారు. దీనిద్వారా ఎప్పటికప్పుడు ఎలక్ట్రిసిటీ వినియోగాన్ని తెలుసుకొని పొదుపు చర్యలు చేపట్టవచ్చు.