WGL: ప్రజలకు వేసవి జాగ్రత్తలతో పాటు వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు డా. రవీంద్రనాయక్ సూచించారు. ఆదివారం సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, ఆశా కార్యకర్తల నుంచి వైద్యాధికారుల వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వర్షాకాలం ముందు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.