CTR: జిల్లాలో పింఛన్లు సోమవారం పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,32,648 మంది లబ్దిదారులకు రూ.100.70 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, ఉదయం నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందజేస్తారన్నారు.