NLR: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం కావలి,1 వ వార్డు అడవిరాజు పాలెం, పాత సంఘంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.