AP: తుడాపై వైసీపీ నేత మోహిత్ రెడ్డి బుక్లెట్ విడుదల చేశారు. తుడాపై పులివర్తి నాని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తుడాలో అభివృద్ధి చేశామో, అవినీతి చేశామో విచారించాలని 2024లో సీఎం లేఖ రాసినట్లు తెలిపారు. 2019లో రూ.29 కోట్లుగా ఉన్న తుడా బడ్జెట్.. 2024 నాటికి రూ.400 కోట్లకు పెరిగిందని చెప్పారు. తుడా భూములు ఆక్రమణకు గురికాకుండా సంరక్షించినట్లు వెల్లడించారు.