AP: జూన్ 4న విజయవాడలో సీఐటీయూ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేసింది. పౌరసేవలను ప్రైవేట్‌కు అప్పగించొద్దని కోరింది. వేలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కార్మికుల హక్కులను హరిస్తే సహించబోమని సీఐటీయూ పేర్కొంది.