GDWL: గద్వాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జమ్మిచేడు జమ్ములమ్మ అవ్వ దేవాలయంలో ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ అధికారి పురేందర్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, ప్రత్యేక పూజల నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. పౌర్ణమి కావడంతో భారీగా భక్తులు హాజరయ్యారు.