ADB: రాజకీయాలలో తొందరపాటు పనికి రాదని సహనంగా వేచి చూస్తే అందరికి పదవులు అవకాశాలు వస్తాయని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరేలా శ్రేణులు ప్రచారం కల్పించాలని కోరారు.