SRD: కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ కురుమ సిద్దుగొండ ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యాడు. ఇటీవల వెలువడిన ఆర్మీ ఫలితాల్లో సత్తా చాటి జీడీగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన తండ్రి మాధుగొండ, గ్రామస్తులు అభినందించారు. ఆర్మీలో ఎంపిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని, బాధ్యతతో వృత్తిని చేపడతానని సిద్దుగొండ ఆదివారం తెలిపారు.