TG: రేపు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కొఠారిలో CM రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. కొత్తగూడలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్ల మంజూరుతో రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5,500-6,500 ఇళ్లను మంజూరు చేసినట్లు అవుతుందన్నారు.