TG: పాఠశాల విద్యలో రాష్ట్ర పనితీరు గణనీయంగా మెరుగుపడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ స్వయంగా వెల్లడించిందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన పీజీఐ నివేదిక తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యాశాఖపై కేంద్రం నివేదికలు తమకు ప్రేరణ ఇచ్చాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థ విధ్వంసమైందని ఆరోపించారు.