PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ ఆదివరాహస్వామి పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఛైర్మన్ ముస్త్యాల దామోదర్ ఇవాళ మానవత్వం చాటుకున్నారు. ఆలయానికి వచ్చిన వయోవృద్ధురాలికి ప్రత్యేకంగా స్వామివారి దర్శనాన్ని కల్పించారు. వృద్ధురాలు క్యూలైన్లో ఇబ్బంది పడుతుండటంతో గమనించిన ఆయన వెంటనే స్పందించి దర్శన ఏర్పాట్లు చేశారు. ఛైర్మన్ సేవలను భక్తులు అభినందించారు.