AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సేనాగళం’ అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే ప్రధానంగా జెన్జీ గళాన్ని వినిపించడమే ‘సేనాగళం’ లక్ష్యమని వెల్లడించారు. రాజ్యాంగానికి కట్టుబడి, అన్ని వర్గాలకు గౌరవం ఇస్తూ ఈ కమిటీ పని చేయాలని దిశానిర్దేశం చేశారు.