MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆర్మీ ఉద్యోగాలు సాధించారు. జన్నారం మండలంలోని రోటిగూడెం చెందిన రవితేజ, చింతగూడ గ్రామానికి చెందిన ఏ. శ్యామ్ మొదటి ప్రయత్నంలోనే ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో తాము ఆర్మీలో చేరుతున్నామని రవితేజ, ఏ. శ్యామ్ తెలిపారు. ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికైన వారిని ప్రజా ప్రతినిధులు ప్రజలు అభినందించారు.