E.G: రాజమండ్రికి మరో మణిహారం మహాలక్ష్మి మార్కెట్ అవుతుందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఆదివారం మోరంపూడి జంక్షన్ వద్ద ఉన్న మహాలక్ష్మి మార్కెట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శర వేగంగా మార్కెట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, సుమారు 400 షాపులతో అతి పెద్ద మార్కెట్‌గా అవతరించబోతుందన్నారు.