JN: పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజాగా క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చాయి. TPCC ఝాన్సీరెడ్డిపై స్థానిక నేతలు హరిప్రసాద్, కృష్ణకిషోర్ ఫిర్యాదు చేయగా, ప్రతిగా MLA యశస్విని రెడ్డి అదే నేతలపై కమిటీకి ఫిర్యాదులు సమర్పించారు. నేడు గాంధీభవన్లో మల్లు రవి నేతృత్వంలోని కమిటీ ఈ ఫిర్యాదులను పరిశీలిస్తుంది.