AKP: కసింకోట మండలం ఏఎస్ పేట శివారు ప్రాంతంలో కోడిపందేల శిబిరంపై ఆదివారం దాడి చేసినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. కోడి పందేలు ఆడుతున్న నలుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.1,400 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.