AP: రేపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని తెలిపారు. ‘ఏపీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మోదీకి ప్రజల తరఫున ధన్యవాదాలు. రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలకు, పారిశ్రామిక వృద్ధికి బాటలు వేస్తుంది’ అని చెప్పారు.