CTR: చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో 110 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురు డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించారు. ఐరాల మండలం గుండ్లపల్లిలో గన్‌పౌడర్, పేలుడు పదార్థాల ముడి పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.