NDL: రేపు సంజామల మండలం ముదిగేడు గ్రామంలో రోట్లో భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బిసి పాల్గొంటారు. అనంతరం మండలంలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.