SRCL: పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల భూమిలోని సారవంతమైన నేలలు దెబ్బతింటాయని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు. ఈ నిప్పుతో ఇతర రైతుల పొలాలు, విద్యుత్ మోటర్లు, స్టార్టర్లు, పైపులు కాలిపోవడమే కాకుండా, ప్రాణ నష్టం జరిగితే సంబంధిత వ్యక్తులపై నాన్-బెయిలబుల్ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.