అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సేవలో– ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని జూన్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆదివారం రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు సకాలంలో అందేలా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.