VSP: దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ జోన్ కోసం బీజేపీ గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశాన్ని చేర్చడంలో పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు త్వరలో వస్తుందని అన్నారు.