NGKL: మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, ప్రజల అభిప్రాయాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టాలని కేసీఆర్ ఆయనకు సూచించారు.