TG: రైతులకు స్మార్ట్ మీటర్ల ఆరోపణలపై చేస్తున్న విమర్శల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టబోమని ఒకవేళ పెడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉండి BRS అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యేలా చూస్తామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ కోసం సబ్ స్టేషన్లు పెంచుకుంటూ వెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచబోమన్నారు.