ASR: అరకులోయ మండలంలో గిరిజన మహిళపై కత్తితో దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తవలస పంచాయతీ పప్పుడువలస సమీపంలో ఆదివారం పొలం పనులు చేస్తున్న జన్ని కరిమ (55) వద్దకు ఓ అపరిచిత వ్యక్తి వచ్చి కత్తితో బెదిరించాడు. అనంతరం ఆమెపై దాడి చేసి చెవి దిద్దులు, కమ్ములను లాక్కొని పరారయ్యాడు.