NRPT: మద్దూర్ మండలం రెనివట్ల గ్రామానికి చెందిన జెన్ను మైబమ్మ కుమారుడు మల్లేష్ ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించినట్లు మల్లేష్ తెలిపారు. ఉద్యోగం సాధించడంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో తోడ్పడిందన్నారు. మల్లేష్ సాధించిన విజయంపై గ్రామస్థులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.