మన్యం జిల్లా ఏర్పడి సంవత్సరాలు గతించిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా జిల్లా అభివృద్ధి జరగడంలేదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తిని మోహన్ ఆరోపించారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపెడితే తప్ప జిల్లా అభివృద్ధి సాధ్యం కాదని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లావ్యాప్తంగా అనేక సమస్యలు జిల్లాను పట్టిపీడిస్తున్నాయని అన్నారు.