ఏలూరు కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం జరిగిన విజ్ఞాన శిబిరంలో 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డిజిటల్ అలవాట్లపై ఆయన అవగాహన కల్పించారు. సమస్యలు ఎదురైతే నిర్భయంగా తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. మొబైల్ ఆటలు మానేసి, మైదాన క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుదని చెప్పుకొచ్చారు.