SRCL: వేములవాడ ఆలయం పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యాలే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.