BPT: వేటపాలెం అసిస్టెంట్ ఇంజనీర్ కే. రామచంద్రుడు పదవీ విరమణ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావంతో పనిచేసిన రామచంద్రుడు సేవలు ఆదర్శప్రాయమని, తమ సేవా కాలంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు.