TPT: నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు ఆదివారం సారే సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి మేళతాళాల నడుమ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 ఏళ్లుగా కొనసాగుతున్న తమ స్నేహబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.