పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నినదిస్తూ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జీ. గీతా బాయి ఇతర అధికారులు పాల్గొన్నారు.