AP: అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్న విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని MP శ్రీభరత్ తెలిపారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద విశాఖకు రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు వెల్లడించారు. మధురవాడ జోన్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, నగర నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి కీలక ప్రాజెక్టులను ఈ నిధులతో చేపడుతున్నట్లు చెప్పారు.