దేశంలో మహిళల ఆర్థిక, డిజిటల్ ప్రగతి పెరిగిందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం 33.3 శాతం నుంచి 64.3 శాతానికి చేరింది. మొబైల్ వాడకం 63.6 శాతానికి, బ్యాంక్ ఖాతాలున్న వారు 89 శాతానికి పెరిగారు. అలాగే యువతుల్లో శానిటరీ ఉత్పత్తుల వాడకం కూడా 79.2 శాతానికి వృద్ధి చెందింది.