AP: విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జులై తొలి వారంలో లడ్డూ పోటు, అన్నదాన సత్రాన్ని ప్రారంభించాలని, భక్తులు నిద్రించేందుకు వీలుగా షెడ్లను నిర్మించాలని, ఎండలు తగ్గగానే ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఈవో, ఛైర్మన్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.