KKD: రౌతులపూడి మండలం శృంగవరం గ్రామంలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ విగ్రహం సమీపంలో రౌతులపూడి వైపు నుంచి వస్తున్న భారీ లోడుతో కూడిన టిప్పర్ లారీ ఇద్దరు మహిళలను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు