WGL: పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పూర్వీకుల సమాధుల స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని బీఆర్ఎస్ 4వ డివిజన్ అధ్యక్షుడు కంచర్ల మనోజ్ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. తరతరాలుగా తమ పూర్వీకులను ఖననం చేసిన ఈ పవిత్ర స్థలాన్ని కొందరు స్వార్థపరులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.