KKD: రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు శనివారం కాకినాడ కలెక్టర్ హరేంధిరప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. CM చంద్రబాబు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ హరేంధిరప్రసాద్తో కలిసి ఎంపీ సతీశ్ బాబు నేరుగా తుని పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు.